![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -326 లో..... లాయర్ సందీప్ వాళ్ళ దగ్గరకి వస్తాడు. ఇక ఆస్తి మా పేరున రాయడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కదా అని సందీప్ అనగానే.. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. సీతాకాంత్ , రామలక్ష్మి లు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని లాయర్ అనగానే.. వాళ్ళను చంపించిన వాళ్ళం.. అది తీసుకొని రావడం మాకు పెద్ద సమస్య కాదని సందీప్ అంటాడు. అప్పుడే సీతాకాంత్ ఫ్రెండ్ సీఐ ఇంటికి వస్తాడు. రామలక్ష్మి, సీతాకాంత్ ల ఫోన్ కలవడం లేదు. అందుకే వచ్చాను ఎక్కడికి వెళ్లారని సీఐ వాళ్ళపై డౌట్ గా అడుగుతాడు.
పొరపాటుగా వాళ్ళు ఆక్సిడెంట్ లో చనిపోతే మేము కారణమా అని శ్రీలత అనగానే.. ఏంటి సీతా, రామలక్ష్మిలు చనిపోయారా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. ఏదో నా మనసుకి అనిపించింది అన్నానని శ్రీలత కవర్ చేస్తుంది. అప్పుడే సీఐకి ఫోన్ వస్తుంది. సరే వస్తున్న అంటూ శ్రీలత వాళ్ళని హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు సీఐ.. హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సీతాకాంత్ ని చూసి శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. ఈ పని మీరే చేశారని నాకు తెలుసు అని సీఐ అంటాడు. సీఐతో గతం లో రామలక్ష్మి మా వాళ్లే మమ్మల్ని చంపాలని చూస్తున్నారని చెప్పిన విషయం గుర్తుచేసుకుంటాడు. మాకేం తెలియదని శ్రీలత వాళ్లు అంటారు. సీతాకాంత్ స్పృహలోకి వచ్చిన విషయం వాళ్లతో చెప్పగానే.. సీతాకాంత్ దగ్గరికి వెళ్తారు. నా రామలక్ష్మి లేకుండా నేను ఉండలేనంటూ సీతాకాంత్ ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా ఎవరో కావాలనే చేపించారని సీతాకాంత్ అనగానే.. ఎవరో కాదు మీ వాళ్ళే అని సీఐ అంటాడు. వాళ్ళు మారారు అలా ఏం చెయ్యరని సీతాకాంత్ నమ్మడు.
నా రామలక్ష్మిని చూడాలని సీతాకాంత్ అంటాడు. ఇంకా డెడ్ బాడీ దొరకలేదని సీఐ చెప్తాడు. త్వరలోనే అసలు నేరస్థులని పట్టుకుంటామని సీఐ అంటాడు. ఆ తర్వాత శ్రీలత పంతులిని పిలిపిస్తుంది. సీతాకాంత్ పై నుండి కిందకి వస్తాడు. రామలక్ష్మికి పిండప్రధానo కోసం రప్పించానని శ్రీలత అంటుంది. నా చేతితో ఎలా చెయ్యాలంటూ సీతాకాంత్ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |